అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (సెప్టెంబర్ 19, 2025) నాడు H-1B వీసా కోసం కొత్త అప్లికేషన్లపై 100,000 డాలర్ల ఫీజు విధించే ప్రకటనపై సంతకం చేశారు, అంటే ఇప్పుడు భారతీయులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి 88 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న H-1B వీసా దారులు రేపటిలోగా తిరిగి అమెరికాలోకి ప్రవేశించాలి. వారికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఇచ్చారు.
లేకపోతే వారు అమెరికాలోకి రావాలంటే $100,000 ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి.
మొత్తానికి, అమెరికా భారతీయులను ఇష్టపడటం లేదనే విషయం స్పష్టంగా కనబడుతోంది. అక్కడి నాయకుల్లో కొంతమంది అయితే భారతీయులు వెళ్లిపోతే తాము సంతోషిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు.