చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. పందుల కోసం వేటాడుతుండగా.. నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శాంతిపురంలో మండలంలోని జోగిండ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… శాంతి పురంలోని పొలంలో పందుల బెడద ఉండటంతో వాటిని తరిమేందుకు శివ అనే వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో తుటాలు అదుపు తప్పి సుభాష్ అనే బాలుడి కడుపులోకి దూసుకెళ్లాయి. దీంతో బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం వేలూరు లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో నిందితులు శివ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థతి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అయితే.. ఈ ఘటన కావాలనే చేసారా.. లేక అనుకోకుండా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post


దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్