వ్యవసాయానకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు… నల్లగొండ పర్యటనలో భాగంగా నల్గొండ పట్టణం సమీపంలోని ఆర్జాలబావి, దుప్పలపల్లి ఐకేపీ సెంటర్ లను సందర్శించారు.
అక్కడధాన్యం కొనుగోళ్లపై రైతులతో ముఖాముఖీ మాట్లాడారు…. ఎంత ధాన్యం పండించారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు అని అడిగి తెలుసుకున్నారు.. మహిళా రైతును నేనెవరినీ అని అడిగి గవర్నర్ తనను తాను పరిచయం చేసుకున్నరు.
అనంతరం ఐకెపి సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ….. నల్గొండ లో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుంది అని పరిశీలించానన్నారు… ఐకెపి సెంటర్ లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నాననీ… ఇప్పటి వరకు 72 శాతం పైగా కొనుగోలు జరిగినట్లు తెలిసిందని పేర్కొన్నారు.