telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ…

Supreme Court

తెలంగాణ సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ ‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. సచివాలయ నిర్మాణంలో యథాతథస్థితిని పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. అలాగే పర్యావరణ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని రేవంత్ కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. అందులో ఇప్పటికే సచివాలయం కూల్చివేత పూర్తయింది కదా అని అడిగింది సీజేఐ. ఇదే అంశంపై జీవన్‌రెడ్డి పిటిషన్‌ను వేరే ధర్మాసనం కొట్టేసినట్లు గుర్తు చేసింది సీజేఐ. అలాగే జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనానికి ఏ పిటిషన్‌ను బదిలీ చేసింది సీజేఐ. అయితే తెలంగాణలో సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చి వేసిన ప్రభుత్వం.. ఆ స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. సెక్రటేరియట్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

Related posts