telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తమది రైతు ప్రభుత్వం ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రం లో ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము. తమది రైతు ప్రభుత్వమని విత్తనం నుండి విక్రయం వరకు అన్ని విధాలా రైతు వెన్నంటి ఉండి భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫ రాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

ముదినేపల్లిలో పచ్చని పొలాల మధ్య పండగ వాతావరణంలో బుధవారం జరిగిన అన్నదాతా సుఖీభవ పీఎం కిసాన్ పధకం రెండవ విడత కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి నమూనా చెక్కును మంత్రి రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో అన్నదాతా సుఖీభవ, పిఎం కిసాన్ పధకం రెండవ విడతలో 1,60,968 మంది రైతుల ఖాతాలకు రూ. 106.23 కోట్లు జమచేశామన్నారు.

అన్నదాతా సుఖీభవ, పిఎం కిసాన్ పధకంలో సంవత్సరానికి రూ.20 వేలు మూడు విడతలుగా అందించడం జరుగుతుంది.

దీనిలో రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు పంటలను ఉద్యానవనంగా ప్రోత్సహిస్తున్నామన్నారు.

మొంథా తుపాన్ కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాలను కేంద్ర బృందం పరిశీలించింది.

నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మెందుకు వాట్సాప్ ద్వారా తమ దగ్గరలోని రైస్ మిల్లులు తెలుసుకోవడం, రైతుకు అనువైన మిల్లులో అమ్మడం వంటి వెసులుబాటు కల్పించామన్నారు.

Related posts