ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వైసిపి ఎంపీ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆయన చొక్కా లేకుండా ఓ మహిళకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ కనిపిస్తున్నారు.
గతంలో పోలీస్ అధికారిగా వుండగా ఓ మహిళను రేప్ చేసారంటూ ఎంపీపై కేసు నమోదయి వున్నట్లు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఇలాంటిది మరోసారి ఎంపీ న్యూడ్ వీడియో రాజకీయ దుమారం రేపుతోంది.
అయితే వివాదాస్పదంగా మారిన తన న్యూడ్ వీడియో కాల్ పై ఎంపీ గోరంట్ల స్పందించారు. దీని వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందన్నారు.
తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ వీడియోను సృష్టించారని పేర్కొన్నారు. తాను జిమ్ లో ఉండగా ఆ తీసుకున్నానని, ఆ వీడియోను మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు.
టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ వీడియోను సర్క్యులేట్ చేశారని ఆరోపించారు.ఇలా దొంగచాటుగా వీడియోలు సృష్టించి దెబ్బతీయాలనుకోవడం వద్దు.. దమ్ముంటే ముందుకువచ్చి ఎదుర్కోవాలని సవాల్ చేసారు.
ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరాను. ఆ వీడియో ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిధ్దమే.