*భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి
*60 అడుగులు దాటిన గోదావరి నీటమట్టం
*ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచన
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 60 అడుగులు దాటింది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు .
భద్రాచలం బ్రిడ్జిపైన ఈ సాయంత్రం నుంచి రాకపోకలు బంద్ చేయనున్నారు. 48 గంటల పాటు బ్రిడ్జిపై రాకపోకలను బంద్ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే భద్రాచలం ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. ఆలయ సమీపంలోని అన్నదాన సత్రం వరకూ వరద నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి పై మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశముందని.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఉద్ధృ తంగా ప్రవహిస్తున్న గోదావరి వరదను భద్రాచలం కరకట్ట వద్ద మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చ ర్యలను ముమ్మరం చేసి లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆయన సూచించారు.

