సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రలహరి” సినిమా రూపొందుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్, వెన్నెలకిషోర్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ చిత్రం టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది ప్రేక్షకుల్లో. తాజాగా ఈ సినిమా నుంచి “గ్లాస్ మేట్స్ …” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ పాట ఇప్పుడు యూత్ ను ఆకర్షిస్తోంది. మీరు కూడా ఓసారి ఈ సాంగ్ ను వినేయండి మరి.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో మెగా మేనల్లుడు హిట్ అందుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. వరుస పరాజయాలతో డీలాపడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం హిట్ కావడం చాలా ముఖ్యం. తేజ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

