బిగ్ బాస్ ఫేమ్, నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రి అయ్యాడు. ఆయన భార్య పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సామ్రాట్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ తన కూతురి తొలి ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.
ఇది తనకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సామ్రాట్ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు.
కాకినాడకి చెందిన శ్రీ నిఖిత అనే అమ్మాయిని సామ్రాట్ 2020 నవంబర్ లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. అం తకు ముందు హర్షితా రెడ్డి అనే యువతితో సామ్రాట్ కి వివాహం అయ్యింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకుని దూరమయ్యారు. తర్వాత శ్రీ నిఖితని వివాహమాడారు. ఆగస్టు 15 న శ్రీ నిఖిత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.
ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి ఆహా నా పెళ్ళంట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘దేనికైనా రెడీ’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాల్లో లీడ్ రోల్‌లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 2లో సామ్రాట్ పాల్గొన్నాడు. తన ఆటతో ఎంతో మంది అభిమనులని సంపాదించుకున్నాడు. ఆ సీజన్ లో కౌశల్ విజేతగా నిలిచాడు.
మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం