ఆసీస్ తో జరిగిన మొదటి సిరీస్ లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో మొదటి రెండు రోజులు భారత్ ఆసీస్ జట్టు పై ఆధిపత్యాన్ని చూపించిందని… దానిని అందరూ గుర్తుంచుకోవాలని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఈ శనివారం నుండి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ గురించి తాజాగా గంభీర్ మాట్లాడుతూ… విరాట్ కోహ్లీ అలాగే సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సిరీస్ కు దూరం అవ్వడం వంటి చాలా సమస్యలు ఇప్పుడు భారత జట్టులో ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ లో మిగిలిన మూడు మ్యాచ్ లలో జట్టుకు న్యాయకత్వం వహించనున్న రహానే పై చాలా బాధ్యత ఉంది. భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వారి రెండు ఇన్నింగ్స్ లోనూ ఆకట్టుకోలేదు, వికెట్ కీపర్ సాహా కూడా బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. కాబట్టి రెండో టెస్ట్ లో భారత జట్టు మంచి కూర్పుతో బరిలోకి దిగ్గాలి అని గౌతమ్ గంభీర్ అన్నారు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో రహానే 4 వ స్థానంలో వచ్చేందుకు చూడాలి అని పేర్కొన్నాడు.
previous post

