శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజినీర్, భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు.
తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్ లాగ్ ను విజయవంతంగా అమర్చిన ఆయన నీటి వృథాను అరికట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం ముగుస్తోందని, ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని కన్నయ్య నాయుడు సూచించారు.
1970కి ముందు నిర్మించిన ప్రాజెక్టులకు స్టాండ్ బై గేట్లు ఏర్పాటు చేయలేదని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. కాబట్టే, ఇప్పుడు తుంగభద్రకు స్టాప్ లాగ్ బిగించాల్సి వచ్చిందని తెలిపారు.