ప్రజా చైతన్య యాత్రలో బాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అడ్డుకునేందుకు కోడిగుడ్లు, టమాటాలతో వచ్చారంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు
దాడి ఘటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు. “ఎక్కడైనా సక్రమంగా చేపట్టే నిరసనలు ఉంటాయి, వైసీపీ తరహా నిరసనలు కూడా ఉంటాయి. సరైన పద్ధతిలో నిరసన తెలియజేయడం అంటే అమరావతి రైతుల మాదిరి శాంతియుతంగా నిరసన చేయాల్సి ఉంటుంది. వైసీపీ తరహా నిరసన విధానం అంటే చెప్పులు విసరడం, టమాటాలు, కోడిగుడ్లు విసురుతూ హింసను ప్రేరేపించడం” అంటూ ట్వీట్ చేశారు.


కమల్ పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు