సంతాన లేమి సమస్య సమాజంలో తీవ్రంగా పెరిగిపోతుంది. పురుషులలో సెక్స్ సామర్ధ్యం తగ్గటం వారిని ఆత్మన్యూనతా భావానికి గురి చేస్తుంది.
సమాజంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతంగా పెరిగిన పని ఒత్తిడి కారణంగా చాలా మంది పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. స్పెర్ము కౌంట్ కూడా పడిపోతుంది.
పండ్లతో లైంగిక సామర్థ్యం వృద్ధి..
లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాలలో పండ్లు కీలకమైన పాత్ర పోషిస్తాయి. శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావించే పురుషులు మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకోవాలని, ప్రతిరోజు ఒకటి, రెండు పండ్లను తింటే వారిలో క్రమంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
పండ్లతో శృంగార సమస్యలకు పరిష్కారం..
శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకునేవారు పుచ్చ కాయలను తినడం మంచిది. పుచ్చ కాయలలో ఎల్ సిట్రైన్ అధికంగా ఉండడం వల్ల అది సెక్స్ సామర్ధ్యాన్ని మరింత పెంచుతుంది.
అరటి పండ్లు కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. అరటి పండులో అధికంగా ఉండే పొటాషియం లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.
ద్రాక్షపండ్ల కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి . ద్రాక్షపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అవి లైంగిక అవయవాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి.
అవకాడో, దానిమ్మ లను తినడం వల్ల కూడా లైంగిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు ఆహారంలో పండ్లను భాగంగా చేసుకుని, రోజు రెండు పండ్లను తిన్నట్లయితే శృంగార సామర్థ్యం క్రమంగా పెరుగుతుంది.
నిత్యం ఇలా పండ్లను తింటూ ప్రయత్నం చేస్తే కొద్దిరోజుల్లో మార్పును మీరే చూడొచ్చు.