భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. ఆతర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. క్రికెట్ కెరీర్లో మంచి పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు పలు కంపెనీలకు ప్రచారకర్తగా కెమెరా ముందు నటించిన భజ్జీ.. ఇప్పుడు సినిమాలో నటిస్తున్నారు. హర్భజన్ సింగ్ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమా ‘ఫ్రెండ్ షిప్’. తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమాలో హర్భజన్ ఓ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని 25 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిని తమిళ్, తెలుగుతో పాటుగా హిందీలోనూ విడుదల చేస్తున్నారు
next post

