అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రేపు శంకుస్థాపన చేయనున్నారు.
తుళ్లూరు – అనంతవరం గ్రామాల మధ్య ఈ ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. బసవతారకం ఆసుపత్రి కోసం 21 ఎకరాల భూమిని సీఆర్డీయే కేటాయించింది.
రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.
అమరావతి బసవతారకం ఆసుపత్రిని తొలి దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నట్టు సమాచారం.
ఆ తర్వాత దీన్ని వెయ్యి పడకలకు విస్తరించనున్నారు. వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
అప్పట్లోనే ప్రభుత్వం ఆసుపత్రికి భూమిని కేటాయించింది. అయితే 2019లో వైసీపీ విజయం సాధించడంతో ఆసుపత్రి నిర్మాణ పనులు ముందుకు సాగలేదు.
ఇప్పుడు మరోసారి ప్రభుత్వం స్థలం కేటాయించడంతో… ఆసుపత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని భావిస్తున్నారు.
ఆ విషయం పవన్ కల్యాణ్ కు ఎప్పుడో చెప్పాను: జయప్రకాష్