telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొత్తగా 2,103 కోవిడ్ కేసులు

Corona

తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కోవిడ్ కేసుల తాజా వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన గణాంకాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,103 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,243 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,386 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,60,933 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,127కు చేరింది. ప్రస్తుతం 29,326 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 298, రంగారెడ్డి జిల్లాలో 172 కేసులు నమోదైనట్టు వెల్లడించింది.

Related posts