తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ లూప్ లైన్‌లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లలో ఈ ప్రమాదం సంభవించింది.
దీంతో రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక శకటాలతో వారు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు.
ఈ ప్రమాదంలో బోగి పూర్తిగా దగ్ధమైంది. రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో.. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నిప్రమాదం సంభవించగానే.. ఇంజిన్ నుంచి బోగీలను వేరు చేశారు. ఈ రెండు రైళ్లు రాత్రికి బయలుదేరాల్సి ఉంది. ఆ క్రమంలో వీటిని లూప్ లైన్‌లో ఉంచారు.