ప్రస్తుతం కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. అయితే మొదటి వేవ్ లో కంటే ఇప్పుడు రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతి దేశంలో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్క్ పెట్టుకోకపోతే ఎవరికైనా సరే జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా, థాయిలాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ వో చాకు భారీ జరిమానా విధించారు. బ్యాంకాక్ అధికారులతో సమావేశం జరిపిన సమయంలో ప్రధాని మాస్క్ ధరించలేదు. దీంతో ఆయనకు 6వేల భాట్ లను జరిమానాగా విధించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉల్లంఘనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే మన దేశంలో కూడా కరోనా నియమాలు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
next post

