telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

టీకా వేసుకున్నా కరోనా మళ్లీ వస్తోంది..అసలు కారణమేంటి ?

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు వివిధ దేశాల్లోని సామాన్య ప్రజలకు పంపిణీ చేయబడుతోంది. భారతదేశంలో రెండో దశ సీనియర్ సిటిజన్లకు టీకాలు వేస్తోంది. అయితే… కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తున్న ఉదంతాలు వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. పలువురు వైద్య సిబ్బందిలోనూ వ్యాక్సిన్‌ డోసు తీసుకున్న తర్వాత పాజిటివ్‌ కేసులు వెల్లడయ్యాయి. అయితే.. వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం ఆయా వ్యక్తులు మాస్క్‌ ధరించడం వంటి కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడం ఒక కారణమని వైద్యులు అంటున్నారు. కరోనాతో ముంచుకొచ్చే వ్యాధికి వ్యాక్సిన్‌ భద్రత కల్పిస్తుందని ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాదని అంటున్నారు. తీవ్ర అస్వస్థత, మరణాలను నిరోధించడం వరకే వ్యాక్సిన్‌ సామర్థ్యం పనిచేస్తుందని.. ఇది కూడా రెండో డోసు తీసుకున్న రెండు, మూడు వారాల ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు వైద్యులు,. వ్యాక్సినేషన్‌ తర్వాత ప్రజలు ఇన్‌ఫెక్షన్‌ బారినపడవచ్చు… దాని వ్యాప్తికి దోహదపడవచ్చనే కారణంతోనే వారు మాస్క్‌లు భౌతిక దూరం పాటించాలని అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నా.. మాస్క్‌ మాత్రం తప్పనిసరి ధరించాలని పేర్కొంటున్నారు.

Related posts