బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తాకు ఒక హోటల్ యజమాని కారణంగా తీవ్ర మాస్థాపానికి గురైనట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “వన్ డే: జస్టిస్ డెలివర్డ్” సినిమా విడుదలైన సందర్బంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందట ఈ బ్యూటీ. ఈ పార్టీ చివర్లో అమ్మడితో రోహిత్ అనే హోటల్ యజమాని అసభ్యంగా ప్రవర్తించాడట. ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్న కూడా విచక్షణారహితంగా ప్రవర్తించడని, అది తనకు చాలా అసౌకర్యంగా అన్పించింది అని, ఆ సమయంలో కొంచమైతే అత్యాచారం చేసేవాడు అన్నట్లుగా అతని ప్రవర్తన ఉందని ఈషా పేర్కొంది. ఇలాంటి వ్యక్తుల వల్ల భవిష్యత్తులో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సెలబ్రెటీ అయిన తనకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అని వ్యాఖ్యానించారు. చివరగా రోహిత్ నువ్వు నాశనమవ్వాలి… అతనెవరో మీకు తెలుసా ? అంటూ కామెంట్ చేసింది ఈషా.
previous post


నటించడం మానేసి చదవమంటున్నారు.. ప్రియా వారియర్