telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

2025-26 విద్యాసంవత్సరానికి తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌ సీట్ల భర్తీకి సంబంధించి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలో ర్యాంకు పొందిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. మొత్తం 3 విడతల్లో ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జులై 7 వరకు కొనసాగుతుంది. స్లాట్ బుకింగ్, పేమెంట్ ఆన్‌లైన్‌ విధానంలో చేయవల్సి ఉంటుంది. జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

జులై 6 నుంచి 10 వరకు కాలేజీలను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జూలై 10 ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇక జులై 13న మాక్ సీట్ కేటాయింపు ఉంటుంది.

జులై 14, 15 న కాలేజీల ఎంపికలు మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. జులై 18న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు చేస్తారు.

జులై 18 నుంచి 22 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ లో రిపోర్ట్ చేయవల్సి ఉంటుంది.

రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే

  • రెండో విడత కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: జులై 25
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తేదీ: జులై 26
  • వెబ్‌ ఆప్షన్లు: జులై 26, 27 తేదీల్లో
  • సీట్ల కేటాయింపు: జులై 30వ తేదీలోపు
  • సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: జులై 30
  • ఫీజు చెల్లింపులు: ఆగస్టు 1వ తేదీలోపు

తుది విడత కౌన్సెలింగ్‌..

  • మూడో విడత కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 5
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తేదీ: ఆగస్టు 6
  • వెబ్‌ ఆప్షన్లు: ఆగస్టు 6, 7 తేదీల్లో
  • సీట్ల కేటాయింపు: ఆగస్టు 10వ తేదీలోపు
  • సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: ఆగస్టు 10 నుంచి 12 వరకు
  • ఫీజు చెల్లింపులు: బ్రాంచి, కాలేజీ మారితే చెల్లించాలి
  • కాలేజీల్లో రిపోర్టింగ్‌: ఆగస్టు 11 నుంచి 13వ తేదీల మధ్యలో

Related posts