telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీకి పరాజయం తప్పదన్న ఎన్నికల వ్యూహకర్త: ప్రశాంత్ కిశోర్

ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు.

ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పదేళ్లుగా తాను ఎన్నికల క్షేత్రంలో ఉన్నానని, కానీ ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకూ చూడలేదని పేర్కొన్నారు.

బీజేపీకి లోగడ కంటే సీట్లు తగ్గవన్నారు. బీజేపీ, మోదీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆగ్రహం లేదని చెప్పారు.

Related posts