telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విపరీతమైన దగ్గుతో ఆసుపత్రికి… స్కానింగ్ లో చూస్తే…!?

Leeche

చైనాలోని జింగ్‌వెన్ కౌంటీలో నివాసముంటున్న వ్యక్తికి రెండు నెలలుగా విపరీతంగా దగ్గు వస్తోంది. కొద్ది రోజుల నుంచి దగ్గినప్పుడు రక్తం కూడా పడటంతో వ్యక్తి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. డాక్టర్ మొదటగా సీటీ స్కాన్ చేయగా.. వ్యక్తి గొంతులో ఎటువంటి తేడా కనిపించలేదు. అనంతరం బ్రాన్కోస్కోపీ చేయగా.. కనిపించిన దృశ్యం చూసి డాక్టర్ ఒక్కసారిగా కంగుతిన్నారు. బ్రాన్కోస్కోపీలో వ్యక్తి ముక్కు కుడిపక్క భాగంలో, గొంతులో రెండు జలగలు ప్రత్యక్షమయ్యాయి. జలగలు ఉండటం కారణంగానే వ్యక్తి విపరీతమైన దగ్గు వస్తున్నట్టు డాక్టర్ రావ్ గ్వాన్‌యాంగ్ నిర్థారించారు. ఈ వార్త విన్న వ్యక్తి ఒక్కసారిగా కలవరపడ్డాడు. వెంటనే అతడికి అనస్థీషియా ఇచ్చి డాక్టర్ రెండు జలగలను బయటకు తీసేయడంతో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కొండ ప్రాంతంలో నివాసముంటున్న వ్యక్తి.. కొద్ది నెలల క్రితం జలగలు ఉన్న నీటిని అనుకోకుండా తాగినట్టు అనుమానం వ్యక్తం చేశాడు. ఆ జలగలు నెలల నుంచి వ్యక్తి రక్తాన్ని తాగుతూ.. అతడి శరీరం లోపలే పది సెంటీమీటర్లు పెరిగినట్టు డాక్టర్ రావ్ చెబుతున్నారు.

Related posts