ఈటలకు మరో షాక్ తగిలింది. భూకబ్జాపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. హకీమ్ పెట్, అచ్చం పెట్ ల్యాండ్స్ పై విచారణ జరుగుతుందని మాసాయి పెట్ ,వెల్దుర్తి తహశీల్దార్ లు మాలతి, సురేష్ కుమార్ అన్నారు. రెండు గ్రామాల పంచాయతీ సెక్రటరీల స్టేట్ మెంట్ తీసుకున్నామని.. 2018 లో జమున హేచరీస్ noc తీసుకున్నామని చెబుతున్న సర్వే నంబర్ లకి …2019 లో noc తీసుకున్న సర్వే నంబర్ లకు తేడా ఉందని పేర్కొన్నారు. పంచాయతీ సెక్రటరీని ఫోర్స్ చేసి noc తీసుకున్నారు…. హకీమ్ పెట్ లో 111 సర్వే నంబర్ లో అనధికార నిర్మాణం జరుగుతుంటే… గ్రామ కార్యదర్శి 2 సార్లు నోటీసులు ఇచ్చారని వెల్లడించారు అధికారులు. సర్వే నంబర్ 111లో 7 ఎకరాలు పట్టా అని.. ఈ నెల 10 న వారు రిప్లై ఇచ్చారు… వాటిని విచారణ చేస్తున్నామన్నారు. 2018 లో noc తీసుకున్నామని చెబుతున్నది మొత్తం 40 ఎకరాలు పట్టా భూమి అని.. 130 సర్వే లో మొత్తం 18.35 ఎకరాలు ఉంటే… అందులో 3 ఎకరాలు పట్టా… 15.35 ఎకరాలు సీలింగ్ అయిందని పేర్కొన్నారు. 2018లో 55, 124, 126 ,127,128 129 సంబంధించి noc తీసుకున్నట్లు చెబుతున్నారని.. 2019 లో పాత సర్వే నంబర్ లకు సర్వే నంబర్ 130 ని యాడ్ చేసి noc తీసుకున్నారని పేర్కొన్నారు. 95.22 ఎకరాల అసైన్ భూములకు సంబంధించి 75 మందికి నోటీసులు ఇచ్చామని… అచ్ఛం పెట్ 77,78,79,80,81,115,130 సర్వే నంబర్ లలో, హకీమ్ పెట్ 97 సర్వే నంబర్ లలో సర్వే జరిగిందన్నారు. ఈ నెల 26,27, 28 తేదీల్లో భూముల సర్వే చేస్తామని వెల్లడించారు.

