telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పోలీసులనే పరుగులు పెట్టించిన చిన్ని ఉడుత

Squrrel

యూఏస్‌లోని న్యూ హాంప్‌షైర్‌లో ఓ చిన్ని ఉడుత ఇద్దరు పోలీసులను పరుగులు పెట్టించింది. గ్యారేజ్‌లో చొరబడిన ఆ ఉడుతను పట్టుకునేందుకు ఇద్దరు పోలీసులు చేసిన ఆ ఛేజ్‌కు సంబంధించిన వీడియోను స్ట్రాతం పోలీసు డిపార్ట్‌మెంట్ తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. గ్యారేజ్‌లో ఉడుతను చూసిన ఇద్దరు పోలీసులు దాన్ని పట్టుకునేందుకు వెంబడించడం, అది వెళ్లి దాక్కొవడం వీడియోలో ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వీడియోను స్ట్రాతం పోలీసు డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా అది నెటిజన్స్‌ను నవ్వులో ముంచెత్తుతోంది. ఇద్దరు పోలీసులు ఒక చిన్న ఉడుతను పట్టుకోలేకపోయారంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈ వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్, కామెంట్లు వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts