ప్రముఖ బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తాకు ఈడీ షాకిచ్చింది. ఆయనకు ఈడీ చరిత్రలోనే అత్యధిక జరిమానా విధించింది. ఎంబీఎస్ జ్యూవెలరీకి 222కోట్ల 44లక్షల భారీ జరిమానాను విధించింది ఈడీ. హాంకాంగ్‌కు డైమండ్ ఎక్స్‌పోర్ట్ చేసిన విషయం పై ఫెమా కేసు నమోదు చేసింది ఈడీ. నిబంధనలు ఉల్లంఘించి విదేశీ ట్రాన్సాక్షన్లు జరిపినట్లు గుర్తించింది. ఈ కేసులో సుఖేష్ గుప్తాకు చుక్కెదురైంది. సుఖేష్‌కు వ్యక్తిగతంగా 22కోట్లు, ఎంబీఎస్ జ్యూవెలరీకి 222కోట్ల 44లక్షల జరిమానా విధించింది ఈడీ. ఈ హాంకాంగ్‌కు డైమండ్ ఎక్స్‌పోర్ట్ లో హవాలా ద్వారా పెద్ద ఎత్తున నిధుల మార్పిడి జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అంతే కాక కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హాంకాంగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం డైమండ్ బిజినెస్ చేయడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈడీ ఫెమా కేసు నమోదు చేసి విచారణ జరిపి అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడం నేపథ్యంలో సుఖేష్ గుప్తా తో పాటు ఎంబీఎస్ జ్యువలరీపైన భారీ జరిమానా విధిస్తూ ఈడీ ఆదేశాలు ఇచ్చింది.
previous post