telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తతో హీరోయిన్ లిప్ లాక్… వీడియో వైరల్

Shriya

సీనియర్ హీరోయిన్ శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శ్రియ ఈనెల 20న తన 38న పుట్టినరోజును జరుపుకుంది. స్పెయిన్‌లో తన భర్తతో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. పుట్టినరోజు సందర్భంగా భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను శ్రియ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే, ఈ వీటిలో లిప్‌లాక్ ఫొటో, వీడియో కూడా ఉండడం గమనార్హం. దీంతో ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2018 మార్చిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శ్రియ భర్తతో కలిసి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటోంది. అయితే, ఆమెకు ముంబైలోనూ ఇల్లు ఉంది. షూటింగ్‌లు ఉన్నప్పుడు విదేశాల నుంచి ముంబైకి వస్తుంటుంది శ్రియ. ఆమె ఎక్కడున్నా ఇండియాలో ఫ్యాన్స్‌తో మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంది.

 

View this post on Instagram

 

Thank you for a beautiful birthday @andreikoscheev Thank you for all your wishes .

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

ఇక శ్రియ ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, సంతోషం’, నువ్వే నువ్వే వంటి సినిమాలతో కుర్రకారును అలరించి టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితోనూ పని చేసింది శ్రియ. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా బిజీ ఆర్టిస్టుగా కొనసాగింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా మునుపటి అంత జోష్ లేదు. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీస్ ‘గమనం’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts