telugu navyamedia
Uncategorized

ఆ సీనే మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్న వార్నర్… ]

2016లో టైటిల్‌ గెలుపొందిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్‌లోనూ అలాంటి ఫలితాలే సాధిస్తుందని ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పుడు చివరి మూడు మ్యాచ్‌లు గెలవాల్సి రావడంతో గెలిచి సాధించామని, ఇప్పుడు కూడా మరో మ్యాచ్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో‌ ఎస్‌ఆర్‌హెచ్‌ అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి.. ఆర్‌సీబీ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏడు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ అనంతరం డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ… ‘ఇంకా ఒక మ్యాచ్ ఉంది. మ్యాచ్‌కు ముందు విజయ్‌ శంకర్‌ను కోల్పోవడం పెద్దలోటు. టాప్ ఆర్డర్‌లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. అయితే అవి బాగా కలిసొచ్చాయి. ఈ రోజు మా బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. నటరాజన్, సందీప్, హోల్డర్, రషీద్ బాగా ఆడారు. ఈ విజయం వారిదే’ అని అన్నాడు.

‘మేం సరైన జట్టుతో కచ్చితమైన భాగస్వామ్యాలు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాం. చివరకు ఓ మార్గం కనుకొన్నాం. 4 ఓవర్లలో 20 కన్నా తక్కువ పరుగులు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వికెట్‌ మందకొడిగా మారుతుండడంతో బౌలర్లు అందుకు అనుగుణంగా బంతులు వేయాలి. దుబాయ్‌లో తేమ ప్రభావం ఉంది. జాసన్ హోల్డర్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. అతడికి బౌన్స్‌ వేయాలంటే కాస్త ఆలోచించాలి. హోల్డర్ నిలకడగా రాణించడం గొప్ప విశేషం’ అని డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసించాడు. ‘ఈరోజు తప్పక గెలవాలని మాకు తెలుసు. ముంబైతో జరిగే తదుపరి మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంది. మాకు 2016లోనూ ఇలాగే జరిగింది. చివరి మూడు మ్యాచ్‌లు గెలవాల్సి రావడంతో గెలిచి సాధించాం. ఇప్పుడు కూడా గెలుస్తాం’ అని ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Related posts