సోషల్ మీడియా వెబ్‌సైట్ ‘ట్విట్టర్’!!.. మార్కెట్‌లో అడుగు పెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఏళ్ల తరబడి శరవేగంగా ఎదుగుతూ పోటీ పడుతున్న ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్లతో ముందుకు సాగుతోంది ట్విట్టర్. 2013లో మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేసింది.’ట్విట్టర్స.
సామాజిక మాధ్యమాల మీద ఆధారపడుతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీరి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రోజుకు ఎన్నో మార్కెట్‌లోకి వస్తున్న ప్పటికీ కొన్నింటి హవా తగ్గడం లేదు. వాటిలో ఫెస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్, ఇన్‌స్ట్రాగ్రాం, పింటారెస్ట్, ట్లంబర్, టిక్‌టాక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఎన్నో యూజర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.
రోజుకో ఫీజర్చ్ యాడ్ చేస్తూ తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డాయి. యూట్యూబ్ లో అయితే వీడియోలకు చూసే వ్యూవర్స్ ని బట్టి డబ్బులు చెల్లించే పద్దతి ఉంది. తాజాగా కఠినమైన నిబంధనలు విధించింది గూగుల్ . ఇక పాపులర్ పోస్టులతో పాటు ఫాలోయింగ్‌ను బట్టి సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, హీరోహీరోయిన్స్, క్రీడాకారులను ఇన్‌స్టాగ్రామ్ కోట్లోల్లో చెల్లిస్తుంది.
మరోవైపు మైక్రో బ్లాగింగ్ సెక్టార్‌లో టాప్‌రేంజ్‌లో కొనసాగుతున్న ట్విట్టర్ అధికారిక ప్రకటన చేసింది. ఇక నుంచి ట్విట్టర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కాసులు సంపాదించుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే ప్రజాదరణ కలిగిన పోస్టులు వలన ఎక్కువగా శాతం వచ్చే లైక్ లను బట్టి డబ్బులు వస్తాయన్నమాట.