
డాక్టర్ రవి వేమూరి ..
సౌమ్యుడు ..చంద్రబాబు ఆశయాలకి అనుగుణం గా ప్రతి నిముషం కష్టపడే వ్యక్తి. APNRT అనే సంస్థని బాబు గారి ఆశయాలకి అనుగుణం గా స్థాపించి ఎంతో మందికి ప్రేరణ కల్పించి NRI లని మాతృభూమి కి సేవ చేసే విధం గా చేసిన వ్యక్తి .ఏనాడు ప్రభుత్వం లో సంపాదించాలి అనే ఏవ లేని వ్యక్తి. ప్రభుత్వం నుంచి జీతం గా రూపాయి వస్తే అంటే మొత్తం లో తన జేబు నుండి వేసుకుని ప్రజలకి ఖర్చు పెట్టే వ్యక్తిత్వం.

అదికారం లో లేకపోయినా ఐదు ఏళ్ళు ఎంతో మందికి స్కిల్ ట్రైనింగ్స్ ఇప్పించి ఉద్యోగాలు మన బాబు గారి ఆశయాలకి అనుగుణం గా ఇచ్చిన వ్యక్తి. పార్టీ కోసం గత ఐదు ఏళ్లలో NRI లు కష్టపడ్డారు అంటే ఆయన చూపిన చొరవ. బాబు గారు అరెస్ట్ అయితే 70 దేశాలలో నిరసనలు కి పిలుపు ఇచ్చి లోకేష్ గారికి బాబు గారికి అందరూ NRIs చూపిన సంఘీభావం మరువలేని మైలురాయి.
మీ లాంటి మంచి వ్యక్తులు వ్యవస్థ లో ఉంటే యువత కి మార్గదర్శం గా నిలుస్తారు. మీ నిజాయితీ కానీ మీ కమిట్మెంట్ కి కానీ, పార్టీ కి సేవ చేసే తీరుకి కానీ, మీరు రిటైర్మెంట్ అయినా మొదటి రోజు నుంచి ప్రజా సేవలో పైసా తినకుండా ఉన్న తీరు కానీ ఎంతో మందికి ఒక గీటురాయి.
మీరు ఈ రోజున ప్రభుత్వ సలహాదారుడ గా , APNRT అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భం గా మనస్పూర్తి గా శుభాకాంక్షలు

