మీకు సిగరెట్ అలవాటు ఉందా… అయితే ఒక్కసారి ఈ వీడియో చూశారంటే మళ్లీ తాగాలనిపించకపోవచ్చు. వీడియోలో నల్లగా, బొగ్గులా కనిపిస్తున్నవి మనిషి ఊపిరితిత్తులు. రోజూ సిగరెట్ తాగడం వల్ల చైనాలో ఓ వ్యక్తికి ఊపిరితిత్తులు ఇలా మారిపోయాయి. ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయిన అతడు అంతకుముందే అవయవదానం కోసం తన పేరు నమోదు చేసుకున్నాడు. దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి పరిశీలించగా ఊపిరితిత్తులు ఇలా కనిపించాయి. వీటిని వైద్యులు వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. ‘‘ఈ వీడియో చూశాక కూడా మీకు సిగరెట్ తాగే దుమ్ముందా’’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
previous post