డాక్టర్ నళిన్ సింఘాల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొంది. ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారని సమాచారం.
ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ డిగ్రీ, ఐఐఎం కోల్ కతాలో పీజీడీఎం పూర్తి చేశారు. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు సీఎండీగా వ్యవహరించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు, ఐఆర్సీటీసీ, సీఈఎల్ లో విభిన్న బాధ్యతలను నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యకలాపాలను జగన్ దెబ్బతీశారు: యనమల