చాలామంది రోజంతా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది.
ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది. అయితే కంటిచూపును కాపాడుకోవటానికి చాలా మంది దృష్టి సారించరు.
కంటి సమస్య ఎక్కువైన తర్వాత ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు.
అయితే ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి.
బత్తాయి, నారింజ వంటి పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి ఆహారం. చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇక మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.
కంటి ఆరోగ్యాన్ని బాదం పప్పు బాగా పెంచుతుంది. బాదం పప్పు నానబెట్టి నిత్యం రెండు పప్పులు తినటం కంటికి మేలు చేస్తుంది.
గ్రుడ్లు, చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహరం. గ్రుడ్లలో జింక్, విటమిన్ ఏ ఉంటుంది ఇది కళ్ళకు మేలు చేస్తుంది.
చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది.
అయితే .. కంప్యూటర్ల ముందు పని చేసేవారు గంటకో మారు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెయ్యటం మంచిది.