telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్

విశాఖపట్నంలో మరో అక్రమసంబంధం బట్టబయలైంది.

భర్త తేజను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. మీడియాను తీసుకెళ్లి అడ్డంగా పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే…

మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర 2013లో ఓ సినిమా చేస్తున్న సందర్భంగా తేజాతో పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం ప్రేమగా మారింది.

దీంతో 2017లో వీరిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అప్పటి వరకు సాఫీగానే సాగిన వీరి సంసారంలో తేజ ఒక్కసారిగా ట్రాక్ తప్పాడు. అసలే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఇతగాడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మొదలు పెట్టాడు.

తనకు పరిచయమైన అమ్మాయిలు తనను పిలుస్తున్నారంటూ ఏకంగా భార్య నక్షత్రతోనే చెప్పేవాడు.

ఈ విషయాన్ని స్వయంగా నక్షత్రనే మీడియా ముందు వెల్లడించింది.

అయితే అప్పటికీ ఎంతో సహనంతో ఉన్న నక్షత్ర… తేజా రోజురోజుకూ హద్దులు దాటుతుండటంతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.

అయినప్పటికీ తేజాలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో అతని నుంచి వేరుగా ఉంటోంది.

తేజా కూడా ఇవేమీ పట్టించుకోకుండా తన అక్రమ సంబంధాలు కొనసాగించాడు. ఇక తేజను ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవాలని భావించిన నక్షత్ర.. మీడియాను వెంటబెట్టుకుని తేజా ఆఫీసుకు వెళ్లింది.

కాలింగ్ బెల్ కొట్టగా తేజ తలుపులు తీశాడు. నక్షత్రను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు తేజ.

ఆఫీసులో మరో అమ్మాయి ఉండటం చూసిన నక్షత్ర ఆమెపై ఆగ్రహంతో దాడి చేసింది. అయితే ఇది ఆఫీసు అయినప్పుడు తేజ మరో అమ్మాయితో పడక గదిలో ఎందుకున్నారంటూ ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే తేజ మాత్రం మరో వెర్షన్ వినిపించాడు. నక్షత్రనే తనపై తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించిందని చెప్పాడు.

ఆఫీసులో మరో సినిమా విషయమై ఒక అమ్మాయితో చర్చలు జరుపుతున్న సమయంలో నక్షత్ర వచ్చి దాడి చేసిందని ఆరోపించాడు.

అది ఇళ్లు కాదని, ఆఫీసు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ అక్రమ వ్యవహారం విషయం మీడియాలో పెద్ద ఎత్తున టెలికాస్ట్ కావడంతో వైజాగ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related posts