పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పీఓకే, పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది.
తొమ్మిది ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. దీన్ని సహించలేని దాయాది దేశం పాక్ వక్రబుద్ధితో భారత్ పై దాడి చేస్తోంది.
కయ్యానికి కాలు దువ్వుతూ భారత్ లోని దాదాపు 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, మిస్సైల్ దాడి చేసింది.
అయితే, భారత ఆర్మీ ఆ డ్రోన్, మిస్సైల్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్వీర్యం చేసింది. ఇక, పాక్కు బుద్ధి చెప్పడానికి రంగంలోకి దిగిన భారత నావికాదళం ఆ దేశానికి కీలకమైన కరాచీ పోర్టును పూర్తిగా నేలమట్టం చేసింది.
కరాచీ పోర్టుతో పాటు పాక్ లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
ఇందుకు సంబంధించిన వీడియోను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
“పాకిస్థాన్లో దీపావళి” అనే క్యాప్షన్ తో ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.