జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ జూన్ 4న కృష్ణా యూనివర్సిటీ వేదికగా ఓట్ల లెక్కింపునకు అధికారులు పూర్తి స్థాయిలో తాయారు కావాలని డి.కె. బాలాజీ అధికారులను కోరారు.
కలెక్టరేట్‌లో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలితో కలిసి సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు శిక్షణా సమావేశాలు నిర్వహించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అయితే వాటి ఫలితాలను ఈవీఎం ఫలితాలతో పాటు ప్రకటిస్తామని డి.కె. బాలాజీ వివరించారు.
RO ల అనుమతి లేకుండా అభ్యర్థుల ఏజెంట్లు కౌంటింగ్ హాల్ నుండి బయటకు రాకూడదు.
మాక్ కౌంటింగ్ నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ ముగించారు.