వివాదాలకు మారుపేరుగా మారిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ‘దిశ ఎన్కౌంటర్’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు వర్మ. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ చంద్ర ఈ సినిమా దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా ట్రైలర్ లో దిశా ఘటనను లైవ్ లో చూసినట్లుగా చిత్రీకరించాడు వర్మ.. ఓ అమ్మాయి బైక్ ని పార్క్ చేయడం.. అక్కడ ఓ నలుగురు యువకులు ఆ అమ్మాయిని చూడడం.. ఆ తర్వాత బైక్ ని పంచర్ చేయడం, ఆ అమ్మాయిని నమ్మించి ఎత్తుకెళ్ళి హత్యాచారం చేయడం.. ఆ తరవాత లారీలో తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్రోల్ పోసి చంపేయడం, వారిని పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేయడం లాంటి సన్నివేశాలను అచ్చుగుద్దినట్టుగా చూపించాడు వర్మ. ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ 26, 2019న ఈ దారుణమైన ఘటన జరగగా, నవంబర్ 26, 2020న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా వర్మ వెల్లడించాడు.

