telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పూరి, మహేష్ కాంబినేషన్ రిపీట్ ?

Mahesh

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. “ఫైటర్” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సినిమా తరవాత పూరీ మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పూరీజగన్నాద్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని ఈ సినిమా తిరగరాసింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో బిజినెస్ మాన్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దాంతో పూరి నుంచి హ్యాట్రిక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. వీరిద్దరి కాంబోలో జనగనమణ అనే రావాల్సి ఉండగా… కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా అటకెక్కింది. అయితే ఇప్పుడు మళ్ళీ మహేష్ – పూరీ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు మహేష్ – పూరీ కలయికలో సినిమా చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్రై చేస్తున్నారని సమాచారం.

Related posts