వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాల సందర్భంగా ఏ2 ముద్దాయి పబ్లిగ్గా దొరికిపోయాడని అన్నారు. బొత్సా, నీవల్ల నాకు 30 కోట్లు నష్టం… నీలాంటి చేతకాని మంత్రులను నమ్ముకుని రూ.30 కోట్లు ఇచ్చానంటూ విజయసాయిరెడ్డి అన్నట్టుగా వార్తలొచ్చాయని ఉమ ఆరోపించారు.
ఆ 30 కోట్లు ఏంటో, ఎవరికిచ్చాడో అవన్నీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో చెప్పుకుంటాడని అన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజా జీవితంలో ఉండకూడదని, ఇలాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అని వ్యాఖ్యానించారు. అందుకే విజయసాయి బెయిల్ రద్దు చేయాలని తాము పిటిషన్ వేస్తామని తెలిపారు.


ఏపీలో నిర్మాణ రంగం క్షీణించిపోయింది: ఉండవల్లి