పేదవారికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వరం లాంటిదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ అన్నారు. గుంటూరులో సోమవారం సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చక్కగా సాగుతోందని పేర్కొన్నారు.
వైద్య విధానంలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ముఖ్యమని తెలిపారు. వైద్యంలో పేదలకు మనోధైర్యాన్ని తెచ్చేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సీఎం జగన్ తీసుకు వచ్చారన్నారు. ఈ పథకం దేశంలోనే వినూత్నమైన సంస్కరణ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు..రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు