telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ పీఠం.. కేజ్రీవాల్ కే .. సర్వే..

Delhi

కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ ఆకర్షణ, అమిత్ షా వ్యూహాలు ఎలాంటి ప్రభావం చూపబోవని హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ సర్వేతో తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఢిల్లీలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.1500 నుంచి రూ.3000 వేలకు ఆదా చేయగలుగుతోందని తెలిపింది.

ఢిల్లీలో విశ్వసనీయత గల నేత లేకపోవడం కూడా బీజేపీకి నష్టం చేసే అంశాల్లో ఒకటని సర్వే తెలిపింది. షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోందని, ఎన్నార్సీ, సీఏఏలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్‌కు మారిందని సర్వే ద్వారా చెప్పింది పీపుల్స్ పల్స్.

Related posts