telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసు : ఎన్సీబీ విచారణకు హాజరైన దీపికా

Deepika

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్సీబీ రియా చక్రవర్తితో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ జయా సాహాను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో దీపిక పదుకొణె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ ‌సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల్లో తమ ముందుకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశించింది. డ్రగ్స్ కేసులో భాగంగా దీపికా పదుకొణె నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరైంది. తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో కలిసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి శనివారం ఉదయం 9.45 గంటలకు చేరుకుంది దీపికా. నిన్న రకుల్‌ను విచారించగా.. ఇవాళ మిగతా ముగ్గురిని ప్రశ్నించనున్నారు.

Related posts