ఆడపిల్ల ఎన్నో కళల ప్రతిరూపం భర్త
ఆ భర్త తనకొక స్నేహితుడిలా
గురువులా,అమ్మలా
అన్నిటికీ మించి నాన్న ప్రేమలా
ఉండాలనుకుంటు
పెళ్లి అవ్వగానే మెట్టినిల్లే
మరో పుట్టినిల్లుగా భావించి
అత్తవారింట కొత్తవసంతమై
అడుగుపెట్టిన కొత్తలోనే
ఆరళ్ల అత్తగారికి శత్రువయ్యావు
అర్దమొగుడైన ఆడపడుచుకు నిస్టూరమయ్యావు…
సుగుణాల రాముడివని తలచి
పిల్లనిచ్చి పెళ్లి చేస్తే
కంచే చేనుని మేసినట్టు
కట్టుకున్న భర్తే నిన్ను బానిసగా చేసి
పడక సుఖాన్నిచ్చే బొమ్మగా నెంచి
పెళ్లినాటి ప్రమాణలని మరచి
కట్నంకోసం,రెండో పెళ్లి కోసం
మొగుడే కాలయముడై నరకాన్నిచూపిస్తుంటే
పగిలిన గుండెతో విలపిస్తున్నావు….
నిన్నకన్న కమ్మని కలలన్నీ
ఎడారిలో మడుగులా ఆవిరైపోతుంటే
భవిష్యత్తు అంధకారమై
ముల్లకంపలో చిక్కుకున్న లేడి పిల్లలా
దేహమంతా గాయలపాలై
కష్టాల సుడిగుండంలో ఊపిరన్నది
ఆడక వేదనలని, వ్యధలని బరిస్తున్నావు
వేధింపులు ఉరుములై తరుముతుంటే
స్వర్గం అనుకున్న సంసారం నరకమౌతుంటే
ఒకనాటికి భర్తచేతిలోనే శవమైపోతున్నావు
వరకట్నమనే భూతానికి బలైపోతున్నావు
పెళ్లంటే ఇదేనా….!!
పెళ్లంటే ఇంతేనా….!!
కాపురం అంటే కట్నమేనా….!!
కాల్చేకట్టే నీకు శాశ్విత చెలిమయ్యేనా..!!
శ్రీదేవి చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు : మాధురీ దీక్షిత్