telugu navyamedia
క్రీడలు వార్తలు

శ్రీశాంత్‌ సిక్స్‌ ను ఎప్పటికి మరిచిపోను : స్టెయిన్

సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టేయిన్ తాజాగా మాట్లాడుతూ… ‘మీకు ఎప్పటికి గుర్తుండిపోయేలా.. చిల్‌ అనిపించేలా.. బ్యాట్స్‌మన్‌ కొట్టిన షాట్‌ గురించి చెప్పండి’ అని  ప్రశ్నించగా.. ”ఆండ్రూ నెల్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ కొట్టిన సిక్స్‌ ఎప్పటికి మరిచిపోను. అతన్ని కవ్వించి మరీ సిక్స్‌ కొట్టించాడు. సిక్స్‌ కొట్టిన అనంతరం శ్రీశాంత్‌ తన బ్యాట్‌ను స్వింగ్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్న మూమెంట్‌ ఇప్పటికి గుర్తుంది. ఎప్పుడు గుర్తొచ్చినా అది నన్ను చిల్‌ చేస్తుంది’అని స్టెయిన్ బదులిచ్చాడు. అయితే 2006లో టీమిండియా ఐదు వన్డేలు.. మూడు టెస్టులు, ఒక టీ20 ఆడేందుకు సౌతాఫ్రికాలో పర్యటించింది. టెస్టు సిరీస్‌లో భాగంగా వాండరర్స్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. దక్షిణాఫ్రికా బౌలర్‌ ఆండ్రూ నెల్‌ అప్పటికే మూడు వికెట్లు తీసి జోరు మీద ఉన్నాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులో ఉన్న శ్రీశాంత్‌ను చూస్తూ ఏదో స్లెడ్జ్‌ చేశాడు. అసలే కోపానికి చిరునామాగా ఉండే శ్రీశాంత్‌కు అతని మాటలు మరింత కోపం తెప్పించాయి. ఆండ్రూ వేసిన ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్‌గా తరలించాడు. అంతే ఆండ్రూ ముఖంలో కోపం.. శ్రీశాంత్‌లో నవ్వు ఒకేసారి కనిపించాయి. ఇంతటితో ఆగకుండా శ్రీశాంత్ తన బ్యాట్‌ను అతనివైపు చూస్తూ.. పనిచేసుకో అన్నట్లుగా స్వింగ్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంటుంది.

Related posts