కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోతున్న వారికి తెలుగు చిత్రసీమ నుండి ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి తమ వంతుగా సాయం చేశారు. అందులో భాగంగా తాజాగా దగ్గబాటి ఫ్యామిలీ ముందుకు వచ్చింది. కరోనా కారణంగా ఇబ్బందుల పాలవుతోన్న సినీ కార్మికులను ఆదుకునే ఆలోచనలో భాగంగా ఒక కోటి రూపాయలను సురేష్ బాబు, వెంకటేష్, రానాలు విరాళంగా ప్రకటించారు. దీనికి సంబందించిన ఓ ప్రకటనను విడుదల చేశారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు స్థంభించిపోయాయి. రెక్కాడితే కానీ డొక్క ఆడని చాలా మంది నిరుపేదలు లాక్‌డౌన్ సందర్భంగా పనిలేకుండా పోయింది. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సినీ నటులు తమ వంతు సామాజిక బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
previous post

