ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ లో వివిధ దేశాల మధ్య క్రికెట్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెట్టింగ్ ల పై పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నారని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఓ షాప్‌పై దాడి చేసి నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.30 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ ప్రధాన నిర్వహకుడు విశాల్ లోద్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.