కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులపై సీపీఐ నేత నారాయణ మరోసారి ఘాటుగా స్పందించారు. కొత్త వ్యవసాయ బిల్లు రైతాంగానికి ఉరితాడని మండిపడ్డారు. రైతులను నరహంతకుల్లాగా చేసే ప్రమాదం ఉందన్నారు.
రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో ఉచిత విద్యుత్‌ను సాధించుకుంటే ఆయన కొడుకే దానికి మంగళం పాడుతున్నాడని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫెడరల్ వ్యవస్థ నాశనం అవుతోందన్నారు. తేనేపూసిన కత్తిలా రాష్ట్రాన్ని మోదీ మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రైతుల బోర్లకు మీటర్లు బిగించడానికి వస్తే వాడి చేతులు మిగలవని హెచ్చరించారు.