వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు కస్టడీకిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది. విజయవాడ లిమిట్స్లోనే కస్టడీలోకి తీసుకొని విచారించారంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది.
న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశించింది. అలాగే వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది.
జైల్లో బెడ్ అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదింరిపుల కేసులో వంశీని పదిరోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ పాత్ర కీలకంగా ఉందని, అతని కనుసన్నల్లోనే నడుస్తోందని.. మరింత విచారణ చేసేందుకు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరారు. గత నాలుగు రోజులుగా ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరుగుగా ఈరోజు న్యాయస్థానం తీర్పునిచ్చింది.
వంశీని మూడు రోజు పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రేపటి (మంగళవారం) నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు అదుపులోకి తీసుకుని 5 తర్వాత తిరిగి అప్పగించేలా ఆదేశించింది.
అంతేకాకుండా న్యాయవాదులు చూసే విధంగా వంశీని విచారించాలని, రోజుకు మూడు సార్లు న్యాయవాది నేరుగా వంశీని కలిసి మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది.