ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ సి పి రాధాకృష్ణన్ ను ఎంపిక చేశారు.
ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.
గతంలో ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్లుగా. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో సీపీ రాధాకృష్ణన్ కు అభినందనలు వెల్లువెత్తాయి.
పార్టీల వైఖరి కారణంగానే ఫిరాయింపులు: విజయశాంతి