ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తాజాగా మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుత గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను అప్పగించారు.
రేపు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలోకి దిగిన సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలవగా రాధాకృష్ణన్‌కు అనుకూలంగా 452 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 781 ఎంపీల్లో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అనంతరం మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి సీపీ రాధాకృష్ణన్ తాజాగా తప్పుకున్నారు.
దీంతో, మహా గవర్నర్ బాధ్యతలను రాష్ట్రపతి ముర్ము ఆచార్య దేవవ్రత్‌కు బదిలీ చేశారు.
23 మంది ఎమ్మెల్యేలే అంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదు: కోడెల